
చైనాకు చెందిన ప్రముఖ ప్రముఖ విద్యుత్ వాహనాల సంస్థ బీవైడీ ( #BYD ), భారత్ మార్కెట్ లో పట్టు బిగించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా భారత్ లోనూ తయారీ యూనిట్ ను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో కు హాజరైన బీవైడీ భారత్ విభాగం బిజినెస్ హెడ్ రాజీవ్ చౌహాన్ ఈ విషయాన్ని వెల్లడించారు.

భారత మార్కెట్ లోకి 25 నుంచి 45 లక్షల ధరలో ఉన్న ఈవీ కార్లను తీసుకురావాలని నిర్ణయించినట్లు చౌహాన్ తెలిపారు. బీవైడీ ప్రధానంగా 20 -25 లక్షలు, అలాగే 40 – 45 లక్షల ధరలో ఉన్న ఈవీ కార్లను భారత్ మార్కెట్ లో తీసుకురానుంది. ఇటీవల జరిగిన ఎక్స్ పోలో ఎలక్ట్రిక్ సీలయన్ 7 కారును కంపెనీ భారత్ మార్కెట్ లోకి లాంచ్ చేసింది. ఈ కారు బుకింగ్స్ ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభం అవుతాయని కంపెనీ చెప్పుకొచ్చింది. ఈ కారు ధర 40 నుంచి 45 లక్షల మధ్యలో ఉంటుందట. గత ఏడాది బీవైడీ ఇండియా భారత్ లో 3500 వాహనాలను విక్రయించింది. కాగా ఈ ఏడాది అమ్మకాలు మరింత పెరగనున్నాయని కంపెనీ ఆశిస్తోంది.


- త్రివిక్రమ్ కు హ్యాండ్ ఇచ్చి, బోయపాటితో బన్ని మైథాలజీ?
- అనిల్ రావిపూడితో టైగర్, గేమ్ ఛేంజింగ్ స్టెప్ ఇది – బిగ్ స్టోరీ
- చిరుతో త్రివిక్రమ్ సినిమా, మరి గాడ్ ఆఫ్ వార్?
- ఆదర్శ కుటుంబం ఫలితం, త్రివిక్రమ్ ఆగమాగం..అసలేం జరిగింది?
- ప్రేమ పెళ్లి చేసుకుంటున్న సాయి ధరమ్ తేజ్? ఇంతకీ ఎవరీ కిరణ్?
- అప్పుడు నిన్నే పెళ్లాడతా .. ఇప్పుడు నిన్నే వెంటాడుతా..?
- ఏంటి రామ్ చరణ్ కొత్త సినిమాకు, ఇంకా హీరోయిన్ ఫైనల్ కాలేదా? సుకుమార్..???
- త్రివిక్రమ్‌కు బిగ్ షాక్, పడిపోతున్న ఆదర్శ కుటుంబం కలెక్షన్లు..
- మొన్నేగా కోలీవుడ్ వెళ్లింది.. అప్పుడే బంపర్ ఆఫర్ పట్టేసిందిగా..
- వారణాసి తర్వాత, మహేష్ మళ్లీ సరిలేరు నీకెవ్వరు అనిపిస్తాడా?
