తమిళ దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ ఇటీవలే LIK అనే చిత్రాన్ని, తెలుగు తమిళ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన సంగతి తెలసిందే. అయితే ఈ చిత్రానికి దర్శకుడు విఘ్నేశ్ శివన్ ముందుగా, లైఫ్ ఇన్సురెన్స్ కంపెనీ అంటే,LIC అనే పేరు పెట్టాలనుకున్నాడట. తాను రాసుకున్న కథకు ఈ టైటిల్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని, ఆడియెన్స్ లోకి ఈజీగా రీచ్ ఉంటుందని అనుకున్నాడట.  అందుకోసం లైఫ్ ఇన్సురెన్స్ కంపెనీ వారిని టైటిల్ కోసం సంప్రదించాడట. కాని వారు టైటిల్  రైట్స్ కోసం ఏకంగా వంద కోట్లకుపైగా డిమాండ్ చేసారట. దీంతో తన దగ్గర అంత డబ్బు లేకపోవడంతో, దర్శకుడు విఘ్నేశ్ శివన్ సింపుల్‌ గా LIK అనే టైటిల్ పెట్టాడట. LIK అంటే లవ్ ఇన్సురెన్స్ కంపెనీ అనే సంగతి తెలిసిందే. 2040లో జరిగే కథగా ఈ చిత్రం తెరకెక్కింది. ప్రస్తుతం థియేటర్స్ లో ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే ప్రదీప్ రంగనాథన్ నటించిన గత చిత్రాల దారిలో వంద కోట్ల వైపు మాత్రం పరుగులు తీసే పరిస్థితులు కనిపించడం లేదు.

ఇవి కూడా చదవండి

error: Content is protected !!