
ఉప్పెన హీరోయన్ అంటే, కృతి శెట్టినే కదా. ఏమైంది ఈ హీరోయిన్ కు, చక్కగా తమిళంలో చిత్రాలు చేస్తోంది కదా.. లవ్ ఇన్సురెన్స్ కంపెనీలో కనిపించింది. ప్రమోషన్స్ లో బాగానే ఉంది. ఇంతలోనే ఈ విషయం ఎలా బయటపడింది. సోషల్ మీడియాకు బానిసైతే ఏం జరుగుతుంది.. అనే డౌట్స్ కళ్లకు ముందుకు వస్తున్నాయి కదా.. ఏం లేదు కృతి శెట్టి తమిళంలో నటించిన లవ్ ఇన్సురెన్స్ కంపెనీలో నటించింది కదా, ఇందులో ఆమె పాత్ర సోషల్ మీడియాకు బానిసైన అమ్మాయిగా నటించింది. అంటే నోమోఫోబియా తో ఇబ్బంది పడే క్యారెక్టర్.
2040లో జరిగే కథలో నటించినా, తాను మాత్రం పాత తరం ప్రేమకథలకే ప్రాధాన్యత ఇస్తానంటోంది. పైగా పదేళ్లు ప్రేమించి, ఆ తర్వాతే పెళ్లికి రెడీ అవుతానంటోంది. అంతా బాగానే ఉంది, మరి రంగంలోకి నయనతార అన్నారుగా అదేంటి అంటే,లవ్ ఇన్సురెన్స్ కంపెనీ చిత్రాన్ని తమిళంలో నయనతార భర్త విఘ్నేశ్ శివన్ తెరకెక్కించాడు. నయనతార ఈ సినిమా సహనిర్మాత. సో అలా సెట్ లో కృతికి ఏదైనా డౌట్స్ ఉన్నా, ఇబ్బందులు ఎదురైనా తాను బలంగా వెనుక నిలిచేది అట.
ప్రస్తుతం కృతి తెలుగులో బిగ్ ఫిల్మ్ సైన్ చేసింది. మన శంకర వర ప్రసాద్ గారు మూవీ తర్వాత అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయబోతున్న కొత్త చిత్రంలో వెంకటేష్, కల్యాణ్ రామ్ హీరోలుగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. వెంకీకి జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇక కల్యాణ్ రామ్ సరసన కృతి కనిపించబోతోందని ప్రచారం సాగుతోంది.
ఇవి కూడా చదవండి
