ఏప్రిల్ 30న రిలీజ్ కావాల్సి ఉంది పెద్ది. ఇప్పటి వరకైతే, చిత్ర యూనిట్ సినిమాను పోస్ట్ పోన్ చేస్తున్నట్లు ఎక్కడా అఫీసియల్‌ గా కన్ ఫర్ మేషన్ ఇవ్వలేదు కాని, సోషల్ మీడియాలో మాత్రం గట్టిగానే రూమర్స్ వినిపిస్తున్నాయి. పెద్దిని ఏప్రిల్ 30 నుంచి పోస్ట్ పోన్ చేసి, జూన్ లో రిలీజ్ చేస్తారని ప్రచారం ప్రారంభమైంది. దీంతో పెద్ది మరోసారి పోస్ట్ పోన్ కానుందని మెగా ఫ్యాన్స్ కూడా నిరాశపడిపోయారు. అయితే సినిమా ఆల్ మోస్ట్ రెడీ అని తెల్సిన తర్వాత ఎందుకు పోస్ట్ పోన్ అనేది మాత్రం, అంతు చిక్కకుండా ఉంది. ఇప్పటికే రెండు సార్లు రీషూట్స్ కూడా పూర్తైనట్లు తెలుస్తోంది. పైగా టీజర్, సాంగ్స్ అన్ని కూడా బజ్ క్రియేట్ చేసుకున్న వేళ, అనుకున్న సమయానికి పెద్ది రిలీజ్ కాకపోవడానికి కారణాలు ఏముంటాయి అనే చర్చ ఇండస్ట్రీలోనూ మొదలైంది. అనుకున్న సమయానికి బుచ్చిబాబు సినిమాను ఎందుకు రిలీజ్ చేయలేకపోతున్నాడు అనే డిస్కషన్ కూడా స్టార్ట్ అయింది. ఒక వైపు ఐపీఎల్, మరోవైపు అరబ్ కంట్రీస్‌లో వార్ సిచ్యువేషన్స్ వల్లే సినిమాను పోస్ట్ పోన్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తెలుస్తోంది. మొత్తంగా పెద్ది పోస్ట్ పోన్ వార్తలు,పాన్ ఇండియా వైడ్ గా హాట్ టాపిక్‌గా మారాయి.

ఇవి కూడా చదవండి

error: Content is protected !!