
తెలుగు నాట మెగాస్టార్ క్రేజ్ గురించి చెప్పేది ఏముంది , అలాంటి హీరో ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేని విధంగా, ఒక స్టార్ డైరెక్టర్ తో చేతులు కలిపాడు. అతనే అనిల్ రావిపూడి. ఎఫ్ 2, ఎఫ్ 3, భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాం, లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత రావిపూడి, ఇప్పుడు మెగాస్టార్ తో కలసి, వచ్చే సంక్రాంతికి రఫ్పాడిద్దాం అంటున్నాడు. షూటింగ్ స్టార్ట్ కాకముందే ప్రమోషన్స్ తో దంచి కొట్టిన రావిపూడి, ఇప్పుడు అఫీసియల్ గా మెగా మూవీ షూటింగ్ స్టార్ట్ చేసాడు. అంటే మే/23/2025న, మెగా మూవీ అఫీసియల్ గా సెట్స్ పైకి వెళ్లిందని చెప్పవచ్చు. ముందుగా టాకీ పార్ట్ మొదలైంది. చిరుపైనే కొన్ని కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు అనిల్ రావిపూడి. సినిమాలో కథానాయికగా నయనతార ఎంపికైంది.
ఇటీవలే మెగా ఎనౌన్స్ మెంట్ కూడా రావిపూడి రేంజ్ లో వచ్చింది. ఆ టీజర్ టాలీవుడ్ కు, మెగా ఫ్యాన్స్ కు బాగా నచ్చింది. సినిమా మొత్తం పూర్తైన తర్వాత విడుదల సమయంలో ప్రమోషన్స్ కు దూరంగా ఉండే నయనతార, ఈసారి మెగా మూవీకి, తన ఎంట్రీ కన్ ఫామ్ చేసేందుకే ఒక వీడియో రిలీజ్ చేయడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. సంక్రాంతికి వస్తున్నాం సంగీత దర్శకుడు భీమ్స్ మరోసారి రావిపూడి మూవీకి మెగా ట్యూన్స్ రెడీ చేసాడని సమాచారం. వచ్చే సంక్రాంతికి ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.
ఇవి కూడా చదవండి
ఇవి కూడా చదవండి
ఇవి కూడా చదవండి
ఇవి కూడా చదవండి