
బాలీవుడ్ బిగ్ స్టార్ షారుఖ్, ఇటీవల జైలర్ -2లో నటించాల్సింది. అయితే తాను నటిస్తోన్న కొత్త చిత్రం కింగ్ చిత్రీకరణలో బిజీగా ఉండటం వల్లే, జైలర్ సీక్వెల్లో నటించలేకపోతున్నాని సూపర్ స్టార్‌కు స్వయంగా ఫోన్ కాల్ చేసి చెప్పినట్లు ప్రచారం సాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కేవలం షారుఖ్ క్యామియో కోసం పెండింగ్‌లో పడింది. కాని షారుఖ్ కు జైలర్ సీక్వెల్లో నటించే ఇంట్రెస్ట్ లేదు. దీంతో ప్రస్తుతం నెల్సన్ సేమ్ క్యారెక్టర్ కోసం ఒక వైపు పవన్ కల్యాణ్ ను మరోవైపు బాలయ్య ను మరోసారి సంప్రదిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాని షారుఖ్ జైలర్ సీక్వెల్‌కు డేట్స్ లేవని చెప్పి, మరో వైపు బన్ని కొత్త చిత్రం రాకాలో కనిపించేందుకు డేట్స్ ఇచ్చాడని ప్రచారం సాగుతోంది. అట్లీతో షారుఖ్‌కు ఉన్న రిలేషన్ కారణంగానే రాకాకు నో చెప్పలేకపోయాడని తెలుస్తోంది. ఇటీవలే బన్ని బర్త్ డే సందర్భంగా రాకా పోస్టర్ రిలీజైన సంగతి తెలిసిందే. రాకాలో పఠాన్ క్యారెక్టర్ ఏంటి అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు.
ఇవి కూడా చదవండి
