
ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా, ప్రశాంత్ నీల్ రిలీజ్ చేసిన డ్రాగన్ గ్లింప్స్, ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే డ్రాగన్ లో డార్క్ టోన్, కనిపించిన క్యారెక్టర్స్, అన్ని కూడా కేజీయఫ్ కంటే సలార్‌ను ఎక్కువ, గుర్తు చేసాయి. దీంతో, సహజంగానే, డ్రాగన్ వరల్డ్‌లోకి సలార్ ఎంట్రీ ఇస్తాడా అనే డౌట్స్ రైజ్ అయ్యాయి. అంతే కాదు సలార్, డ్రాగన్ క్రాస్ ఓవర్ కు ఛాన్స్ ఉందనే, ఊహాగనాలు మొదలయ్యాయి. కాని ఇందులో ఎలాంటి నిజం లేదని, కేజీయఫ్, సలార్, డ్రాగన్ మూడు వేరు వేరు ప్రపంచాలు అంటున్నాడు నీల్.
తాను తెరకెక్కించే విధానం ఒక్కటే అయినా, కథలు మాత్రం వేటికి అవే వేరు అని డ్రాగన్ ప్రమోషనల్ ఇంటర్వూస్‌లో చెప్పుకొచ్చాడు. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు యూనివర్స్‌కు చాలా క్రేజ్ ఉంది. అందుకే దర్శకులు అవకాశం ఉన్న ప్రతి సమయంలోనూ యూనివర్స్‌ను క్రియేట్ చేసి, భారీ బ్లాక్ బస్టర్స్ అందుకుంటుంటారు. కాని తన సినిమాలకు, తన కథలకు యూనివర్స్ క్రియేట్ చేసే స్కోప్ ఉండి కూడా, నీల్‌కు ఆశక్తి లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
నిజానికి సలార్ విడుదల సమయంలో కేజీయఫ్ నుంచి ఒక పాత్ర సలార్‌లో కనిపిస్తుందని బాగా ప్రచారం సాగింది. అదే నిజం అయి ఉండే,సలార్ కూడా వెయ్యి కోట్ల వసూళ్లను దాటి ఉండేది. కాని నీల్‌కు తన సినిమాలతో యూనివర్స్ క్రియేట్ చేసే ఆలోచన లేకపోవడంతో, సలార్‌కు మైల్ స్టోన్ మిస్ అయింది. కనీసం భవిషత్ లో అయినా,
ప్రశాంత్ నీల్ తన సినిమాల మధ్య యూనివర్స్ క్రియేట్ చేసి, బాక్సాఫీస్ ను బద్దలు కొడతాడేమో చూడాల్సి ఉంది. ప్రస్తుతం నీల్ డైరెక్ట్ చేస్తోన్న డ్రాగన్ వచ్చే ఏడాది జూన్ 11న విడుదల అవుతోంది.
ఇవి కూడా చదవండి
