
శ్రీలీల , ఒకప్పుడు టాలీవుడ్ సెన్సేషన్. యాక్టింగ్ సంగతి పక్కన పెడితే, డ్యాన్స్ మాత్రం నెక్ట్స్ లెవల్. అందుకే పుష్ప సీక్వెల్లో సైతం పుష్ప రాజ్‌తో స్టెప్పులేసింది. పాన్ ఇండియాను ఊపేసింది. కాని ఇదంతా గతం. ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో తనకు కష్టకాలం నడుస్తోంది. చేతిలో చెప్పుకోదగ్గ చిత్రాలు లేవు. ఈ పరిస్థితుల్లో తమిళ సినీ పరిశ్రమలో తన అదృష్టాన్ని పరిక్షించుకుంటోంది శ్రీలీల.
ఏడాది ప్రారంభంలో పరాశక్తి అనే చిత్రంతో అక్కడ అడుగు పెట్టింది. కాని ఈ సినిమా ఫలితం నిరాశపరిచింది. ఆ తర్వాత ధనుష్ కొత్త చిత్రం ఓంలో కీలక పాత్రలో నటిస్తోంది. ఇది అత్యంత భారీ స్టార్ కాస్ట్‌తో తెరకెక్కిన చిత్రం, మమ్ముట్టి, సాయి పల్లవి, ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. వీరిని దాటి శ్రీలీల ఏమేర తన పాత్రతో మెప్పిస్తుందో చూడాల్సి ఉంది. నవంబర్ 20న ఓం రిలీజ్ అవుతోంది.
ఇప్పుడు కోలీవుడ్‌లో మరో బిగ్ ఛాన్స్ అందుకుంది. అదే స్టార్ హీరో అజిత్ నటిస్తోన్న కొత్త చిత్రం డేర్ డెవిల్. తమిళ సినీ పరిశ్రమలో బిగ్గెస్ట్ స్టార్స్ లో ఒకడు అజిత్. అలాంటి హీరో నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఇది. పైగా ఈ చిత్రంతో అజిత్ నిర్మాతగా మారుతున్నాడు. అనిరుధ్ సంగీతాన్ని అందించే బాధ్యతను తీసుకున్నాడు. ఈ సినిమా క్లిక్ అయితే మాత్రం కోలీవుడ్‌లో శ్రీలీల దశ మారిపోతోంది.ఈలోపు ఓం కూడా ఇంప్రెస్ చేస్తే, ఇక తమిళంలో శ్రీలీలకు ఎదురు ఉండదు.
టాలీవుడ్లో కూడా ఇలాగే వరకు ఆఫర్స్ తో ఏకంగా మహేష్ బాబు సరసన నటించే అవకాశం అందుకుంది శ్రీలీల. బాలీవుడ్లో సైతం డెబ్యూతోనే అక్కడి స్టార్ హీరో కార్తిక్ ఆర్యన్ తో ప్రేమకథా చిత్రంలో నటించే అవకాశం అందుకుంది. ఇప్పుడు అదే సెంటిమెంట్‌ను కోలీవుడ్‌లోనూ రిపీట్ చేసింది. అన్నట్లు అజిత్ ,శ్రీలీల మూవీని అధిక్ రవిచంద్రన్ తెరకెక్కిస్తున్నాడు. ఇతను అజిత్‌కు వీరాభిమాని. గతంలో గుడ్ బ్యాడ్ అగ్లీ తీసి అజిత్‌కు హిట్ ఇచ్చాడు. ఈసారి అంతకంటే పెద్ద హిట్ ఇస్తానంటున్నాడు. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసి, వచ్చే ఏడాది దీపావళికి సినిమాను విడుదల చేయాలనే ప్లాన్స్ లో ఉన్నారు.
ఈ సినిమా పై మరిన్ని అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు ప్రైడ్ తెలుగు మీకు అందిస్తుంటుంది… ఫాలో అవ్వడం, షేర్ చేయండి, ప్రోత్సహించండి..
ఇవి కూడా చదవండి..
