
ఆదర్శ కుటుంబం అంచనాలను అందుకోకపోవడంతో, త్రివిక్రమ్ ఇప్పుడు తన ప్లాన్స్ మార్చినట్లు సమాచారం. ఆదర్శ కుటుంబం తర్వాత తెరకెక్కాల్సిన గాడ్ ఆఫ్ వార్ కు బ్రేక్స్ కు వేసి, ఇమిడియెట్గా మరో ప్రాజెక్ట్ పై ఫోకస్ పెడుతున్నాడట. అదే చిరంజీవితో, కొత్త సినిమా అని ఇండస్ట్రీలో బాగా ప్రచారం సాగుతోంది. పైగా ఈసారి, తాను గత కొన్నేళ్లుగా సినిమాలు తీస్తోన్న హారికా హాసినీ క్రియేషన్స్ లో కాకుండా, దానయ్య బ్యానర్ లో డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ తో సినిమా తీస్తాడట.
చిరు, దానయ్య, త్రివిక్రమ్ ఈ కాంబినేషన్ లో గతంలోనే సినిమా రావాల్సి ఉండగా, ఇప్పుడు ఇది పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి గాడ్ ఆఫ్ వార్ సంగతి అంటే, అది హారికా హాసినీతో త్రివిక్రమ్ కు ఉన్న సంబంధాల నేపథ్యంలోనే ఉండనుంది. అంతా సర్దుకుంటే చిరుతో చిత్రం తర్వాత హారికా హాసినీ క్రియేషన్స్ లో త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో గాడ్ ఆఫ్ వార్ ఉంటుంది లేదా సినిమా హోల్డ్ లో పడినా ఆశ్చర్యం లేదు.
పైగా రామాయణం విడుదల తర్వాత పౌరాణిక చిత్రం అంటే ఆకాశమే హద్దుగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే గాడ్ ఆఫ్ వార్‌కు బడ్జెట్ ఇష్యూస్ కూడా ఉండటంతో, ముందు మెగాస్టార్ మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చి, ఆ తర్వాత తన కెరీర్లో డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన గాడ్ ఆఫ్ వార్ పై ఫోకస్ పెట్టాలి అని త్రివిక్రమ్ భావిస్తున్నాడట.
త్రివిక్రమ్ – చిరు కాంబినేషన్, అలాగే గాడ్ ఆఫ్ వార్ మూవీ గురించి మరిన్ని అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు ప్రైడ్ తెలుగు మీకు అందిస్తుంటుంది… ఫాలో అవ్వడం, షేర్ చేయండి, ప్రోత్సహించండి..
ఇవి కూడా చదవండి..
