హిట్ పెయిర్ వేరు, క్లాసిక్ పెయిర్ వేరు, ఆల్ టైమ్ లేదా ఎవర్ గ్రీన్ పెయిర్ వేరు.. నిన్నే పెళ్లాడతా చిత్రంతో నాగార్జున, టబు కాంబినేషన్ ఓ విధంగా ఆల్ టైమ్  ఎవర్ గ్రీన్ హిట్ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇదంతా కూడా కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన నిన్నే పెళ్లాడతా సినిమా ఎఫెక్ట్.  ఆ తర్వాత మరికొన్ని చిత్రాల్లో వీరిద్దరు కలసి నటించారు, ఎప్పుడు తెరపై కలసి కనిపించినా, అదే క్రేజ్ రిపీట్ అవుతుంటుంది.

ఇప్పుడు నాగార్జున కెరీర్‌లో మైలురాయిగా నిలిచే చిత్రంలో టబు నటిస్తోంది. అయితే ఈసారి నాగార్జునకు జోడీ కాదు, ఏకంగా విలన్ రోల్ చేస్తోంది టబు. తన పాత్ర ఎలా ఉండబోతోంది, అనేది  చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన గ్లింప్స్ తో చెప్పేయవచ్చు.

చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన గ్లింప్స్  లో టబు రెండు రకాల మనుషులు ఉంటారని చెబుతూ, ఒకరు కష్టాన్ని నమ్ముకుంటే, మరొకరు అదృష్టాన్ని నమ్ముకుంటారని చెప్పుకొచ్చిన డైలాగ్  హైలైట్. కింగ్ 100 లో టబు మహంతి ఝాన్సీ రాణి పాత్ర పోషిస్తోంది.

కాస్త కేజీయఫ్‌లో రవీనా టాండన్ షేడ్స్ కనిపిస్తున్నాయి. కాకపోతే ఇలాంటి పాత్రలను టబు అద్భుతంగా పోషించగలదు. బాలీవుడ్‌ అనేక నెగిటివ్ షేడ్స్ క్యారెక్టర్స్ చేసి చేసి తిరుగులేని నటిగా ఎదిగింది టబు. ప్రస్తుతం కింగ్ 100లో భాగమైంది. తమిళ దర్శకుడు రా .కార్తిక్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తోన్న కింగ్ 100 క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

కింగ్ 100 పై మరిన్ని అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు ప్రైడ్ తెలుగు మీకు అందిస్తుంటుంది… ఫాలో అవ్వడం, షేర్ చేయండి, ప్రోత్సహించండి..

ఇవి కూడా చదవండి..

error: Content is protected !!