మెగా ఫ్యామిలీలో మరోసారి పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఈసారి సుప్రీమ్ హీరోగా పాపులర్ అయిన సాయి ధరమ్ తేజ్ పెళ్లి పీటలెక్కడానికి రెడీ అవుతున్నాడు. అయితే సాయి పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి ఎవరూ అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. తేజ్‌తో మూడు ముళ్లు వేయించుకోబోతున్నది ఎవరో కాదు, తన స్నేహితురాలు కిరణ్. వీరిద్దరికి చాలా కాలంగా పరిచయం ఉందని, స్నేహంగా మొదలై, ఆ తర్వాతగా ప్రేమ మారి, ఇప్పుడు పెళ్లి పీటల వరకు వచ్చిందని, ప్రచారం సాగుతోంది.

అయితే ఓరిజినల్ లవ్ స్టోరీ ఏంటి అనేది వీరిద్దరు రివీల్ చేయాల్సిందే. డిసెంబర్‌లో పెళ్లి పెట్టుకున్నారు.  ఈలోపు పెళ్లి పనుల్లో నిమగ్నం కానుంది మెగా ఫ్యామిలీ. హైదరాబాద్‌లో జరిగిన ఘనంగా జరిగిన ఎంగేజ్ మెంట్ ఈవెంట్‌ గురించి తెల్సిందే. చిరు, నాగేంద్ర బాబు, పవన్ తప్ప మెగా ఫ్యామిలీ మొత్తం కూడా ఈ ఈవెంట్‌లో సందడి చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం సంబరాల ఏటి గట్టు అనే చిత్రంలో నటిస్తున్నాడు. వచ్చే సంక్రాంతి పండక్కి ఈ చిత్రం విడుదల కానుంది.  

మెగా మ్యారేజ్ పై మరిన్ని అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు ప్రైడ్ తెలుగు మీకు అందిస్తుంటుంది… ఫాలో అవ్వడం, షేర్ చేయండి, ప్రోత్సహించండి..

ఇవి కూడా చదవండి..

error: Content is protected !!