ప్రైడ్ తెలుగు న్యూస్ – స్టార్ హీరోయిన్స్ మ్యారేజ్ ఇప్పుడు అన్ని ఇండస్ట్రీస్ కామన్ అయిపోయాయి. మ్యాగ్జిమమ్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ మ్యారేజ్ అయిపోయింది. దీపిక పదుకొనె, ఆలియా భట్, కియారా అడ్వానీ .. వీరు హ్యాపీగా కోస్టార్స్ తో ప్రేమలో పడి,పెళ్లి పీటలెక్కేసారు. ప్రస్తుతం సినిమాల్లోనూ బిజీగా ఉన్నారు. ఇప్పుడు జాన్వీ కపూర్ కూడా సీనియర్స్ ను ఫాలో కావాలనుకుంటోంది.

చాలా కాలంగా జాన్వీ శిఖర్ పహారియాతో ప్రేమలో ఉంది. జాన్వీ కెరీర్ బిగినింగ్ నుంచి ఇతను సపోర్ట్ చేస్తూ వస్తున్నాడు. శ్రీదేవి లేని లోటు కొంతైనా తీర్చుకున్నాడు. అందుకే తననే పెళ్లి చేసుకోవాలనుకుంటోంది జాన్వీ. అయితే కెరీర్ బిగినింగ్ లోనే మ్యారేజ్ అంటే కెరీర్  కు ఇబ్బందులు అని ఆలోచిస్తూ ఆగిపోయింది. అయితే ఇటీవల తిరుపతికి ప్రియుడు శిఖర్ తో కలసి వచ్చింది జాన్వీ.

గతంలోనూ చాలా సార్లు వచ్చింది. కాని ఈసారి మాత్రం శిఖర్ తల్లి కూడా విచ్చేసారు. దాంతో త్వరలోనే జాన్వీ పెళ్లి కబురు చెప్పనుందని బాలీవుడ్ మీడియా కోడైకూస్తోంది. ఏది ఏమైనా జాన్వీ పెళ్లి కబురు, ఇప్పుడు కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. జాన్వీ కపూర్ ఇటీవలే దేవరలో నటించింది. త్వరలో రామ్ చరణ్ కొత్త చిత్రంలో కథానాయికగా కనిపించనుంది.

ఇవి కూడా చదవండి..

error: Content is protected !!