
రికార్డులు.. వసూళ్లు.. ప్రేక్షకులు.. ఈ మూడు పదాలకు, పాన్ ఇండియా సినిమాలకు మాత్రమే పేటెంట్ ఉందనుకుంటే మీరు పొరపడినట్లే.. లేదా రికార్డులు, వసూళ్లు, ప్రేక్షకులు గురించి ప్రస్తావన రావాలంటే ప్రభాస్, అల్లు అర్జున్, సినిమా రిలీజ్ కావాల్సిన అవసరం లేదు. రాజమౌళి కొత్త సినిమా విడుదల చేయాల్సిన అవసరం లేదు. వెంకటేష్ ఒక్కడు చాలు. సేమ్ రికార్డులు, సేమ్ వసూళ్లు, ప్రేక్షకుల బ్రహ్మరథం అన్ని చూపిస్తాడు. ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్నాం మూవీతో, సేమ్ ట్రెండ్ రిపీట్ చేస్తున్నాడు. ఈ మూవీ మొదటి వారం వసూళ్లు ఎంతో తెలుసా 203 కోట్లు. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత దిల్ రాజు పోస్టర్ వేసి మరీ చెప్పాడు. ఇదిగోండి ఆ పోస్టర్.

జనవరి 14న, సంక్రాంతి సినిమాల్లో, ఆఖరున, కరెక్ట్ గా సంక్రాంతి రోజే విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం. అనిల్ రావిపూడి గతంలో వెంకీతో ఎఫ్ 2, ఎఫ్3 తీసి ఉండటంతో, ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్లే, సినిమా విడుదలకు ముందు చిత్ర యూనిట్ చేసిన వెరైటీ ప్రమోషన్స్ కూడా, ఈ చిత్రానికి కలిసొచ్చింది. ఉదయం ఆట నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం,. ఆ తర్వాత ఆట నుంచి మిగితా సంక్రాంతి సినిమాలను డామినేట్ చేయడం మొదలు పెట్టింది. ముఖ్యంగా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న డాకు మహారాజ్ మూవీని, సంక్రాంతికి వస్తున్నాం వసూళ్లలో పూర్తిగా వెనుకపడేసింది.

అసలే వెంకటేష్, ఆ పైన సంక్రాంతి సీజన్, రిలీజైంది ఫ్యామిలీ మూవీ. దాంతో విక్టరీ నటించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీని చూసేందుకు, ఫ్యామిలీస్ పెద్ద ఎత్తున థియేటర్స్ కు పరుగులు తీస్తున్నాయి. అందుకే సినిమా విడుదలైన మొదటి వారంలోనే ఈ చిత్రం 200 కోట్లు రాబట్టగలిగింది. పాన్ ఇండియా సినిమా కాదు, పాన్ సౌత్ ఫిల్మ్ అంతకంటే కాదు. అయినప్పటికీ వెంకీ మాత్రం 300 కోట్ల వైపు పరుగులు తీస్తున్నాడు. చాలా ఏరియాల్లో ఈ చిత్రం వసూళ్లు త్రిబుల్ ఆర్ కు దగ్గరిగా, మరికొన్ని ఏరియాల్లో లేటెస్ట్ టాలీవుడ్ సెన్సేషన్ పుష్ప-2 కలెక్షన్స్ ను సైతం ఈ చిత్రం క్రాస్ చేయనుందని ప్రచారం సాగుతోంది. ఏది ఏమైనా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో, టాలీవుడ్ బాక్సాఫీస్ ను బద్దలు కొడుతున్నాడు విక్టరీ.

- 70 ఏళ్ల హీరో, 40 ఏళ్ల హీరోయిన్స్, ఏంటి ఈ రొమాన్స్..నాన్సెన్స్!
- ఏకంగా పవన్ సినిమా పైనే కుట్ర, టాలీవుడ్ లో అసలు ఏం జరుగుతోంది? ( సంచలనం)
- అటు పెద్ది, ఇటు దేవర, అదిరిపోయిన ఫోటో వార్
- మీరు మెగా ఫ్యాన్స్.. అయితే ఇదిగో గుడ్ న్యూస్
- సీక్వెల్స్ క్రేజ్ నాశనం చేయకండి, బన్ని లేకుండా ఆర్య-3 వద్దే వద్దండి!
- వార్ -2 టీజర్ : ఎన్టీఆర్ ను నరకానికి స్వాగతించిన హృతిక్ రోషన్
- కాంతార -2 విడుదల ఇప్పట్లో కష్టమేనా?
- షారుఖ్ కోసం ప్రభాస్‌ను వద్దనుకున్న దీపిక?
- ఎన్ని బయోపిక్స్ లో నటిస్తావ్ ధనుష్? మొన్న ఇళయరాజా, నేడు కలాం
- స్పిరిట్ నుంచి దీపిక్ ఔట్, నేషన్ క్రష్ ఇన్?