ఎక్స్ క్లూజివ్ .. అదీ ఈరోజుల్లో అంత సీన్ లేదంటారా…లేదు.. లేదు.. త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తోన్న కొత్త చిత్రం ఆదర్శ కుటుంబం నుంచి, ఒక ఎక్స్ క్లూజివ్ న్యూస్ ప్రైడ్‌ తెలుగుకు తెలిసింది. అదేంటి అంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న, ఆదర్శకుటుంబం స్టిల్ కు సంబంధించిన స్టోరీ ఇది. త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తోన్న ఆదర్శకుటుబంలో వెంకటేష్ హీరోగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఇఫ్పుడు వీరిద్దరు ఏదో రైల్వే స్టేషన్ లో నిలబడి మాట్లాడుతున్న ఫోటో బయటికి వచ్చింది. దీనిని బట్టి ఆదర్శకుటుంబం సినిమాకు సంబంధించిన ఒక షెడ్యూల్‌ ను రైల్వే స్టేషన్‌లో ప్లాన్ చేస్తున్నారని అర్ధం చేసుకోవచ్చు.

అయితే ఆదర్శ కుటుంబంలో త్రివిక్రమ్ వందే భారత్ నేపథ్యంలో ఒక హిలేరియస్ కామెడీ ఎపిసోడ్ ప్లాన్ చేసాడట. అందుకోసమే చిత్ర యూనిట్ ప్రస్తుతం రైల్వే స్టేషన్ నేపథ్యంలో సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారని సమాచారం. త్రివిక్రమ్ ప్లాన్ చేసింది అయితే వందే భారత్, మరి ఇప్పుడు ప్లాన్స్ మారాయా లేక పర్మిషన్స్ వచ్చాయా , మరో ట్రైన్‌ తో అడ్జెస్ట్ అయ్యారా.. లేక గ్రాఫిక్స్ తో మాయ చేస్తారా లేదా అన్నది తెలియాలి అంటే ఈ సినిమా విడుదల వరకు వెయిట్ చేయాల్సిందే. దసరా కానుకగా ఈ మూవీని విడుదల చేయబోతున్నారు.

ఇవి కూడా చదవండి

error: Content is protected !!